ప్రేమలో ఉండే మ్యాజిక్ ను తన పాటలో బాగా చెప్పగలరు చంద్రబోస్. పవర్ స్టార్ సెన్సేషనల్ మూవీ ఖుషిలో చంద్రబోస్ రాసిన అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా పాట పెద్ద హిట్టయ్యింది. ఈ పాటలో ‘నీ ఒంట్లో చిరుచెమటైనా నా పాలిట పన్నీరే, నువ్విచ్చి పచ్చిమిరపైనా నా నోటికి నారింజే..’ అని రాశారు చంద్రబోస్. ప్రేమలో ఉంటే అలాగే ఉంటుంది మరి.
ఇప్పుడు డ్రింకర్ సాయి సినిమాలో ‘నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే, నువ్వు తన్నితే వెన్న పూసినట్టున్నదే, నువ్వు రక్కితే చక్కిలిగింతపుడుతున్నదే, నువ్వు తొక్కితే థాయ్ మసాజ్ చేసినట్టుందే..’ అంటూ లవ్ మ్యాజిక్ చెప్పేలా రాశారు చంద్రబోస్.
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన డ్రింకర్ సాయి సినిమా నుంచి ‘నువ్వు గుద్దితే..’ పాటను ఈ రోజు రిలీజ్ చేశారు. సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు.