తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి చర్చ జరిగింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ కు రావొద్దని పోలీసులు, థియేటర్ యాజమాన్యం చెప్పినా అల్లు అర్జున్ వచ్చారని అందుకే తొక్కిసలాట జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తొక్కిసలాటలో మహిళ చనిపోతే, ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వెళ్లి పరామర్శించలేదని, అల్లు అర్జున్ ను ఏ సమస్య లేకున్నా ఆయన దగ్గరకు మాత్రం క్యూ కట్టారని సీఎం రేవంత్ అన్నారు.
ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించమని ఆయన అన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఇకపై టికెట్ రేట్లు పెంపునకు, ప్రీమియర్ షోలుకు పర్మిషన్ ఇవ్వమని ప్రకటించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ ను విమర్శించారు.