“పుష్ప 2” ఇప్పట్లో ఓటీటీలోకి రానట్లేనా?

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు కనీసం 56 రోజుల టైమ్ బాండ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 5న థియేటర్స్ లోకి పుష్ప 2 వచ్చింది. 56 రోజులు అంటే జనవరి నెలాఖరు వరకు పడుతుంది. దీంతో పుష్ప 2 సినిమాను ఓటీటీలో చూసేందుకు జనవరి నెలాఖరు వరకు మూవీ లవర్స్ ఎదురుచూడాల్సిందే.

అయితే యూట్యూబ్ లో పుష్ప 2 హిందీ వెర్షన్ అనేక ఛానెల్స్ లో పోస్ట్ చేశారు. అలాగే పైరసీ సైట్స్ లోనూ పుష్ప 2 ఉండటం మేకర్స్ కు చికాకు కలిగిస్తోంది. పుష్ప 2 తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు తగ్గినా, నార్త్ లో ప్రేక్షకులు బాగానే చూస్తున్నారు. ఇప్పటికే 1500 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటినట్లు ప్రొడక్షన్ హౌస్ చెబుతోంది. ఇది 2000 కోట్ల మార్క్ కు రీచ్ అవుతుందా లేదా అనేది ఇప్పటికి సస్పెన్స్ గానే ఉంది.