శ్రీలీల – టైమ్ ఈజ్ మనీ

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఎక్కడ జరిగినా శ్రీలీల అక్కడ కనిపిస్తోంది. టైమ్ ఈజ్ మనీ అన్నట్లు ఆమె ఏ షాప్ ఓపెనింగ్ కు అయినా వెళ్తోంది. హైదరాబాద్ మాత్రమే కాదు జిల్లాలూ తిరిగేస్తోంది. ఇటీవల శ్రీకాకుళం, విజయనగరంలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లకు అతిథిగా వెళ్లింది. శ్రీలీలను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

తన కోసం వచ్చి గుమిగూడిన వారి ముందు పుష్ప 2 కిస్సిక్ సాంగ్ స్టెప్స్ చేస్తూ ఉత్సాహపరుస్తోంది శ్రీలీల. టాలీవుడ్ లో ఒక కెరటంలా ఎగసింది శ్రీలీల. వరుసగా స్టార్స్ తో సినిమాలు చేస్తూ వచ్చింది. ఆ సినిమాల్లో తన క్యారెక్టర్ ఏంటని కనీసం అడిగి కూడా ఉండదు. అందుకే శ్రీలీల క్రేజ్ ఎంత ఫాస్ట్ గా పెరిగిందో అంతే ఫాస్ట్ గా తగ్గిపోయింది. త్వరలో ఆమె రాబిన్ హుడ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.