“బచ్చలమల్లి”కి నెగిటివ్ రెస్పాన్స్

నాంది సినిమా తర్వాత సీరియస్ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేస్తున్నారు హీరో అల్లరి నరేష్. ఈ క్రమంలోనే ఆయన రా అండ్ రస్టిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్ తో లేటెస్ట్ మూవీ బచ్చలమల్లి చేశారు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకోలేకపోయింది. బచ్చలమల్లిలో నరేష్ యాక్టింగ్ బాగున్నా, ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించలేదని టాక్ వస్తోంది. ఓ‌వరాల్ గా అన్ని రివ్యూస్ లో మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథలో ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసే అంశాలేవీ లేవని చెబుతున్నారు. మూర్ఖుడిలా ప్రవర్తించే హీరో పాత్ర పెద్దగా కనెక్ట్ కాలేదు. హీరో పాత్రను చూస్తున్నప్పుడు జాలి, బాధ, కోపం, సంతోషం..ఇలా వీటిలో ఏదో ఒకటి మనం ఫీల్ కావాలి. అలాంటి ఏ ఎమోషన్ కూడా బచ్చలమల్లి పాత్ర కలిగించలేదని అంటున్నారు. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించగా సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించాడు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.