సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతోంది “కిల్లర్”. ఈ చిత్రాన్ని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్, హీరో పూర్వాజ్ రూపొందిస్తున్నారు. జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో విశాల్ రాజ్, గౌతమ్ అనే మరో ఇద్దరు యంగ్ హీరోలు నటిస్తున్నారు. క్వాలిటీ, స్పీడ్ మెయింటేన్ చేస్తూ “కిల్లర్” షూటింగ్ చేస్తున్నారు దర్శకుడు పూర్వాజ్. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ కంప్లీట్ చేశారు. త్వరలోనే సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రెండో షెడ్యూల్ షూటింగ్ రామెజీ ఫిలింసిటీ, వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాల్లో జరిపారు. సినిమా ఔట్ పుట్ పట్ల హ్యాపీగా ఉన్నామని, కాస్ట్ అండ్ క్రూ సపోర్ట్ తో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేశామని దర్శకుడు, హీరో పూర్వాజ్ తెలిపారు. లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో “కిల్లర్” సినిమా కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ లా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నామని పూర్వాజ్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.