ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లిన కన్నడ స్టార్ శివరాజ్ కుమార్

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో అభిమానులు, సన్నిహితులు ఆయనకు సెండాఫ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. శివన్న ఆరోగ్యంగా తిరిగి రావాలని ఫ్యాన్స్, ఇండస్ట్రీ సహచరులు పోస్టులు చేస్తున్నారు. అమెరికా బయలుదేరేముందు శివరాజ్ కుమార్ ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమయంలో కిచ్చా సుదీప్ తో పాటు మరికొందరు నటీనటులు, దర్శక నిర్మాతలు ఆయనను కలిశారు.

ఇటీవల శివరాజ్ కుమార్ కు తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. శస్త్ర చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్తున్నారు. ఈ నెల 24న శివరాజ్ కుమార్ కు ఫ్లోరిడాలోని ఆస్పత్రిలో ఆపరేషన్ జరగనుంది. తిరిగి వచ్చాక తన కొత్త సినిమాలకు డేట్స్ ఇవ్వనున్నారు. ఇటీవల శివరాజ్ కుమార్ భైరతి రణగల్ పెద్ద విజయం సాధించింది. ఆయన రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు.