అఖిల్ ఏజెంట్ తర్వాత గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేయాలి అనుకున్నాడు కానీ.. అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఏదేంటో కానీ.. అఖిల్ కు గ్యాప్ వచ్చేస్తుంది. ఏజెంట్ తర్వాత యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ చిత్రం చేయాలి అనుకున్నాడు. దీనికి ధీర అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాని బడ్జెట్ 100 కోట్లు అని కూడా ఫిక్స్ చేశారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవితో యువీ సంస్థ విశ్వంభర సినిమా చేస్తుంది. అందుచేత ఆ సినిమా రిలీజ్ తర్వాత అఖిల్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలి అని ఫిక్స్ అయ్యారు. విశ్వంభర వాయిదా పడడం.. ఈ మూవీ ఇంకా ఆలస్యం అవుతుండడంతో అఖిల్ మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాను సైలెంట్ గా స్టార్ట్ చేశారు.
ఈ మూవీకి లెనిన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. లెనిన్ అనగానే రష్యా గుర్తొస్తుంది. అలాగే కమ్యూనిస్ట్ భావజాలం గుర్తొస్తుంది. చరిత్రతో పరిచయం ఉన్న వాళ్లవెరైనా లెనిన్ ని మర్చిపోరు. లెనిన్ వెనకాలా చాలా కథ ఉంది. అయితే.. ఈ కథకు, ఆ కథకు సంబంధం లేదట. కాకపోతే ఓ లవ్ స్టోరీని కొత్తగా చెప్పడానికి లెనిన్ అనే పాయింట్ ని ఈ కథలో వాడుకొన్నాడట డైరెక్టర్. ప్రేమ, విప్లవం, ప్రేమలో కమ్యూనిజం.. ఇలాంటి భావాలతో ఈ కథ సాగుతుందని.. హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. శ్రీలీలతో పాటు మరో బ్యూటీ కూడా ఈ సినిమాలో నటిస్తుందట. ఆమె ఎవరు అనేది తెలియాల్సివుంది. ఈ మూవీకి సంగీతం సంచలనం ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.