అబ్బాయిల ప్రేమను అమ్మాయిలు అర్థం కన్నా అపార్థమే ఎక్కువగా చేసుకుంటారు. ఎంత చెప్పినా, ఎన్ని చేసినా వాళ్లు నిజమైన ప్రేమను తెలుసుకోలేరు. ఇలాంటి సందర్భంలోనే అబ్బాయిలు అర్థం చేసుకోవు ఎందుకే అనుకుంటారు. యూత్ ఫుల్ లవ్ స్టోరీ డ్రింకర్ సాయిలో ఇదే సందర్భాన్ని పాటగా డిజైన్ చేశారు. ఈ పాటను హీరో బాధను వ్యక్తపరిచేలా శ్రీవసంత్ కంపోజ్ చేయగా, లవ్ పెయిన్ తెలిపే లిరిక్స్ అందించారు చంద్రబోస్.
ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ పాటను పాడటం విశేషం. అర్థం చేసుకోవు ఎందుకే పాటను ఈ రోజు డ్రింకర్ సాయి మేకర్స్ రిలీజ్ చేశారు. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి రూపొందించారు. యూత్ ఆడియెన్స్ లో డ్రింకర్ సాయి సినిమా మీద మంచి బజ్ ఏర్పడుతోంది.