ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఆయన ప్రమాణస్వీకారానికి సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు కుటుంబ సభ్యులతో పాటు పలువురు నిర్మాతలు పాల్గొన్నారు. ఎఫ్ డీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం
దిల్ రాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తనమీద ఉంచిన ఈ బాధ్యతను గౌరవంగా స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఎఫ్ డీసీ ఛైర్మన్ గా తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ మధ్య వారధిగా ఉంటానని, చిత్ర పరిశ్రమలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానని ఈ సందర్భంగా దిల్ రాజు తెలిపారు.