పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందే మూవీ స్పిరిట్. ఈ క్రేజీ మూవీలో కరీనా కపూర్, మృణాల్ ఠాగూర్ నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ప్రచారంలో ఉన్న వార్త నిజమా..? కాదా..? అనేది ఆసక్తిగా మారింది. ప్రభాస్ ను సందీప్ రెడ్డి వంగ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా చూపించబోతున్నాడు. ఈ సినిమాలో కరీనా కపూర్, సైఫ్ ఆలీఖాన్ నటించనున్నారని ప్రచారం జరిగింది. కరీనా కీలక పాత్ర అని.. సైఫ్ ఆలీఖాన్ విలన్ అంటూ టాక్ వినిపించింది. వీరితో పాటు మృణాల్ ఠాగూర్ పేరు కూడా వినిపించింది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వార్తలు రావడంతో నిజమే అనుకున్నారు కానీ.. ఇదంతా గ్యాసిప్ తప్పా ఇందులో నిజం లేదని తెలిసింది.
కరీనా, మృణాల్ స్పిరిట్ లో నటించడం అనేది గ్యాసిస్ అయితే.. మరి.. నిజం ఏంటంటే.. కైరా అద్వానీ, నయనతారను ఫైనల్ చేశారు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ప్రభాస్ తో నయనతార యోగి సినిమాలో నటించింది. ఆతర్వాత మళ్లీ కలిసి నటించలేదు. ఇప్పుడు సెట్ అయ్యిందని సమాచారం. కైరా అద్వానీ ఫస్ట్ టైమ్ ప్రభాస్ తో నటించబోతుంది. తెలుగులో మహేష్ బాబుతో భరత్ అనే నేను, చరణ్ తో వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ చిత్రాల్లో నటించింది. తెలుగు, హిందీ భాషలతో పాటు మిగిలిన భాషల్లో కూడా కైరా అద్వానీకి మంచి గుర్తింపు వుంది. అందుకనే కైరాను ఫైనల్ చేశారని తెలిసింది.