నితిన్ రెండు సినిమాలు ఒకేసారి చేస్తున్నాడు. వాటిలో ఒకటి.. రాబిన్ హుడ్ అయితే.. రెండోది తమ్ముడు. ఈ రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో రూపొందుతోన్న రాబిన్ హుడ్ సినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఈ సినిమాతో పాటు నాగచైతన్య తండేల్ కూడా క్రిస్మస్ కి విడుదల చేయాలి అనుకున్నారు. అయితే.. తండేల్ ఫిబ్రవరి 7కు పోస్ట్ పోన్ అవ్వడంతో ఇక రాబిన్ హుడ్ రావడం ఫిక్స్ అని టాక్ గట్టిగా వినిపించింది కానీ.. వర్క్ అనుకున్న టైమ్ కి కంప్లీట్ కాకపోవడం.. ప్రమోషన్స్ చేయడానికి టైమ్ లేకపోవడంతో ఈ చిత్రాన్ని అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడం లేదు అని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు. నితిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిస్మస్ కు విడుదల చేయాలి అనుకున్నాడట కానీ.. కుదరలేదు.
క్రిస్మస్ లో రావడం లేదు.. మరి.. రాబిన్ హుడ్ వచ్చేది ఎప్పుడంటే.. ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. ఇక అసలు విషయానికి వస్తే.. రాబిన్ హుడ్ డిసెంబర్ లో వస్తే.. తమ్ముడు సినిమాను మార్చిలో రిలీజ్ చేయాలి అనుకున్నారట. ఒక నెల గ్యాప్ లో నితిన్ నుంచి రెండు సినిమాలు వస్తే.. బిజినెస్ పరంగా ఇబ్బందులు రావచ్చు. అందుకనే కాస్త ఎక్కువ గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. రాబిన్ హుడ్ ఫిబ్రవరిలో వస్తే.. తమ్ముడు చిత్రాన్ని మే లేదా జూన్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చిన తర్వాత తమ్ముడు రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందని సమాచారం.