టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గేమ్ ఛేంజర్ మూవీని పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై దిల్ రాజు 200 కోట్లకి పైగా పెట్టుబడి పెట్టారు. సినిమా పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తనకి సక్సెస్ ఇస్తుందని నమ్ముతున్నారు. అయితే.. గతంలో సినిమా ప్రమోషన్స్ కోసం పెద్దగా ఖర్చు పెట్టని దిల్ రాజు గేమ్ చేంజర్ విషయంలో మాత్రం రూట్ మార్చారు. ఈ సినిమా భారీ కలెక్షన్స్ అందుకోవాలంటే నేషనల్ వైడ్ గా క్రేజ్ కావాలి. ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి ఈ సినిమా కంటెంట్ ని బలంగా తీసుకొని వెళ్ళాలి. అందుకే ప్రమోషన్స్ విషయంలో దిల్ రాజు ఆలోచన మార్చుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ మెగా ప్రీరిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో నిర్వహించబోతున్నారు.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మూవీ టీమ్ మొత్తం యూఎస్ వెళ్లబోతోంది. ఈ ఈవెంట్ కోసం దిల్ రాజు భారీగానే ఖర్చు పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఇండియాలో ఐదు ప్రధాన పట్టణాలలో మెగా ఈవెంట్స్ ని ఏర్పాటు చేయబోతున్నారని తెలిసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఐదు ఈవెంట్స్ లో పాల్గొని సినిమాని పబ్లిక్ లోకి తీసుకొని వెళ్ళబోతున్నారు. జనవరి మొదటి వారం నుంచి వరుసగా ఈ ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2కి మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ప్రమోషన్స్ చాలా ప్లస్ అయ్యాయి. ఈ రోజు పుష్ప 2కు వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ వస్తున్నాయంటే.. నేషనల్ వైడ్ గా నిర్వహించిన ఈవెంట్స్ కూడా ఒక కారణం అని చెప్పచ్చు. అందుకే గేమ్ చేంజర్ విషయంలో కూడా పుష్ప 2 ఫార్ములాని దిల్ రాజు వాడుతున్నట్లు తెలుస్తోంది.