డీజే టిల్లు సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ నేహా శెట్టి. టిల్లు స్క్వేర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతోనూ తన క్రేజ్ ను కంటిన్యూ చేసింది. ఇప్పుడీ హీరోయిన్ కు ఓ బిగ్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో నేహా శెట్టి కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా క్రేజీ ప్రాజెక్ట్ అనే క్యాప్షన్ రాసింది నేహా.
ఆమె చెప్పింది ఓజీ గురించే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓజీలో పవన్ సరసన ఆడిపాడే ఛాన్స్ వస్తే అది నేహాకు మంచి అవకాశమే అనుకోవాలి. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు సుజీత్ ఓజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.