“లాపతా లేడీస్”కు ఆస్కార్స్ ఛాన్స్ మిస్

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ సినిమా ఆస్కార్ ఛాన్స్ మిస్ చేసుకుంది. భారత్ నుంచి ఈ సినిమా ఆస్కార్స్ కు నామినేట్ అయ్యింది. అయితే నిన్న ప్రకటించిన షార్ట్ లిస్టులో లాపతా లేడీస్ పేరు లేదు. దీంతో ఈ సినిమా ఆస్కార్ పోటీ నుంచి తప్పుకున్నట్లయింది. లాపతా లేడీస్ కు ఉత్తమ విదేశీ కేటరిగీలో అవార్డ్ వస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

కిరణ్ రావుతో కలిసి అమీర్ ఖాన్, జ్యోతి దేశ్‌పాండే లాపతా లేడీస్ చిత్రాన్ని నిర్మించారు. నితాన్షి గోయల్, ప్రతిభా రాంటా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మహిళలకు చదువు, ఆర్థిక స్వేచ్ఛ ఎంత ముఖ్యమో ఈ సినిమాలో చూపించారు దర్శకురాలు కిరణ్ రావు.