ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా తెర వెనక విశేషాలతో ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ డాక్యుమెంటరీని ఈ నెల 20న సెలెక్టెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజు ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ట్రైలర్ లో సినిమాలోని సీన్స్ ఎలా తెరకెక్కించారో, ఆ సీన్స్ చేసేందుకు ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి అండ్ టీమ్ ఎలా కష్టపడ్డారో చూపించారు. ఆస్కార్ గెల్చినప్పుడు, విదేశాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రేక్షకులు ఆదరించినప్పుడు మూవీ టీమ్ ఎలా ఫీలయ్యారో రివీల్ చేశారు. ఈ సినిమా తమ కెరీర్ లో ఎంత ప్రత్యేకమో మూవీ టీమ్ చెప్పిన సంగతులు ట్రైలర్ లో ఆసక్తిని కలిగించాయి.