అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమా నుంచి శ్రుతి హాసన్ తప్పుకుందనే వార్తలు ఇప్పటికే రాగా ఆ న్యూస్ ను కన్ఫర్మ్ చేస్తూ మృణాల్ ఠాకూర్ సెట్స్ లో జాయిన్ అయ్యింది. శ్రుతి ప్లేస్ లోకి మృణాల్ ను తీసుకున్నారు మేకర్స్. ఈ రోజు మృణాల్ ఠాకూర్ బర్త్ డే సందర్భంగా ఆమెకు విశెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్యామిలీ స్టార్, కల్కి 2898ఎడి తర్వాత మృణాల్ చేస్తున్న చిత్రమిదే.
ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు షానీల్ డియో డెకాయిట్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు. అడివి శేష్, షానీల్ డియో సంయుక్తంగా కథ, స్క్రీన్ ప్లే రూపొందిచారు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న డెకాయిట్ చిత్రం మహారాష్ట్రలో లాంగ్ షెడ్యూల్ కు రెడీ అవుతోంది.