ఎమోషనల్ కంటెంట్ తో రానున్న రామ్ “సాగర్”

రామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సాగర్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. యంగ్ డైరెక్టర్ పి.మహేశ్ బాబు రూపొందిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు.

సాగర్ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా చాలా ఎమోషనల్ కంటెంట్ తో ఉంటుందని తెలుస్తోంది. విషాధకరమైన ఎండింగ్ తో ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా రామ్ క్యారెక్టర్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. టైటిల్ రివీల్ టైమ్ లో రిలీజ్ చేసిన పోస్టర్ లో రామ్ నైన్ టీస్ లుక్ లో ఆకట్టుకున్నాడు.