ఆమిర్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబో ఫిక్స్?

నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో పలు క్రేజీ మూవీస్ తెరకెక్కాయి. ఇప్పుడీ కాంబోలో మరో ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తో వీరు సినిమా చేయబోతున్నారు. ఇటీవల ఆమిర్ ఖాన్ ను కలిసి దిల్ రాజు, వంశీ పైడిపల్లి స్టోరీ నెరేట్ చేశారు. ఈ కథకు తాజాగా ఆమిర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో నెక్ట్ మంత్ మూవీని అఫీషియల్ గా లాంఛ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఆమిర్ ఖాన్ ప్రస్తుత ఫామ్ లో లేరు. అయినా ఆయన స్టార్ డమ్, టాలెంట్ అందరికీ తెలిసిందే. తెలుగు మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో తెలుగు దర్శకులపై బాలీవుడ్ స్టార్స్ కు నమ్మకం పెరిగింది. ఆ క్రమంలోనే వంశీ పైడిపల్లితో ఆమిర్ ఖాన్ సినిమా చేసేందుకు సందేహం లేకుండా ఒప్పుకున్నారని అనుకోవచ్చు.