పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ క సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు హీరో కిరణ్ అబ్బవరం. ఓ మంచి సూపర్ హిట్ కోసం చూస్తున్న ఆయనకు క కోరుకున్న విజయాన్ని ఇచ్చింది. ఇప్పుడీ ఉత్సాహంలో తన కొత్త మూవీ కెఎ10 టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు కిరణ్ అబ్బవరం.
“కెఎ10” అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.ఈ రోజు “కెఎ10” సినిమా నుంచి ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. “క” సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రంగా “కెఎ10” పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.