“భోళా శంకర్” లో మెగాస్టార్ కాదు పవర్ స్టార్ కనిపిస్తారట

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఇచ్చిన స్పీచ్ ఆసక్తిని కలిగించింది. ఈ సినిమా తన అభిమానులకు ప్రత్యేకమని చెప్పిన చిరంజీవి…సినిమాలో ఎక్కువ సన్నివేశాల్లో తన కంటే పవన్ ను చూసిన ఫీలింగ్ కలుగుతుందని చెప్పాడు. ఈ సినిమాలో తాను పవన్ అభిమానిగా కనిపిస్తానని చిరు తెలిపారు. పవన్ మేనరిజమ్స్ వేదిక మీద చేసి చూపించారు. చిరంజీవి పవన్ గురించి మాట్లాడినప్పుడల్లా ఆడిటోరియంలో కేకలు వినిపించాయి.

భోళా శంకర్ ప్రీ రిలీజ్ లో చిరంజీవి మాట్లాడుతూ – నేను ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తుంటానని అంతా అంటుంటారు. కథ బాగుంటే, అది మన నేటివిటీకి సరిపోతే రీమేక్ ఎందుకు చేయకూడదు. వేదాళం సినిమా నుంచి ఇన్స్ పైర్ అయి చేసిన సినిమా ఇది. అయితే ఆ సినిమా ఏ ఓటీటీలో లేదు. మనవాళ్లు పెద్దగా చూసి ఉండరు. కాబట్టి ఫ్రెష్ మూవీలాగే అనిపిస్తుంది. అన్నా చెల్లెలు సెంటిమెంట్ బాగుంటుంది. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం కథ విన్నప్పుడే కలిగింది. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే చాలా సీన్స్ లో నా బదులు పవన్ కనిపించిన ఫీలింగ్ కలుగుతుంది. అతని మేనరిజమ్స్ చాలా చోట్ల ఇమిటేట్ చేశాను. అని చెప్పారు.