సౌత్ లో ఇద్దరు దర్శకులకు మహా డిమాండ్ ఏర్పడుతోంది. ఆ ఇద్దర ఎవరంటే..కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రశాంత్ నీల్, తమిళ ఇండస్ట్రీ నుంచి లోకేష్ కనకరాజ్. వీరికున్న లైనప్ చూస్తుంటే ఆ సినిమాలన్నీ పూర్తయ్యే సరికి కనీసం ఐదారేళ్లు పట్టేలా ఉంది. ఖైదీ, విక్రమ్ సినిమాల తర్వాత లోకేష్ కు దర్శకుడిగా స్టార్ ఇమేజ్ వస్తే..కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్.
ఈ ఇద్దరు దర్శకుల అప్ కమింగ్ మూవీస్ లిస్టు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. లోకేష్ ప్రస్తుతం విజయ్ హీరోగా లియో సినిమా రూపొందిస్తున్నారు. ఆ తర్వాత ఆయనకు రజనీకాంత్ తో సినిమా ఉంది. దాని తర్వాత కార్తీతో ఖైదీ 2 చేయబోతున్నారు. ఆ తర్వాత
ప్రభాస్ తో ఓ సినిమాకు చర్చలు జరుగుతున్నాయి. ఈ వరుసలో ప్రభాస్ కాంబో మూవీ టైమ్ వచ్చేసరికి మరో నాలుగేళ్లు పట్టేలా ఉంది.
ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ కు అప్ కమింగ్ మూవీస్ లిస్టు కూడా భారీగానే ఉంది. ఆయన ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా రూపొందిస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ఉంది. దీని తర్వాత కేజీఎఫ్ 3 అనౌన్స్ చేస్తారు.ఆ తర్వాత మహేశ్ బాబుతో ఓ సినిమా అంగీకరించారు ప్రశాంత్ నీల్. రామ్ చరణ్ తోనూ ఆయన ఓ సినిమా రూపొందించే అవకాశాలున్నాయి. ఇవన్నీ భారీ ప్రాజెక్ట్స్ కాబట్టి ఒక్కొక్కటిగా చేస్తూ వెళ్లాలి. ఒక్కో సినిమాకు కనీసం రెండేళ్లు పట్టేలా ఉంది.ఈ లెక్కన ఉదాహారణకు మహేశ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు ఎప్పటికి వీలవుతుందో ఊహించుకోవచ్చు.