కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మరో యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటించిన “మ్యాక్స్” సినిమా డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్ పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు.
తాజాగా రిలీజ్ చేసిన “మ్యాక్స్” డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కిచ్చా సుదీప్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మ్యాక్స్ సినిమా టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో మ్యాక్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది.