సమంత మయోసైటిస్ అనే వ్యాథితో బాధపడుతున్నట్టుగా యశోద సినిమా ప్రమోషన్స్ టైమ్ లో బయటపెట్టింది. ఆతర్వాత శాకుంతలం సినిమా ప్రమోషన్స్ టైమ్ లో కూడా ఈ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని మరోసారి కన్ ఫర్మ్ చేసింది. ఇటీవల ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టుగా ప్రకటించి షాక్ ఇచ్చింది. కారణం ఏంటంటే.. ఈ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడడం కోసం ఆరోగ్యం పై శ్రద్ద పెట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకుందట. అయితే.. ఈ ట్రీట్మెంట్ కోసం భారీగా అంటే 25 కోట్లు ఖర్చు అవుతుందని.. టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో సమంతకు ఆర్థిక సాయం చేశాడని వార్తలు వచ్చాయి.
ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి నిజంగానే అంత ఖర్చు అవుతుందా..? నిజంగానే స్టార్ హీరో సమంతకు ఆర్థిక సాయం చేస్తున్నాడా..? ఇదే నిజమైతే ఆ హీరో ఎవరు..? ఇలా అనేక ప్రశ్నలు. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తల పై సమంత స్పందించింది. తన మాయోసైటిస్ వ్యాధికి అంత పెద్ద మొత్తంలో ఖర్చు కాదని, అసలు అంత భారీ మొత్తాన్ని నేను ఒక హీరో నుండి తీసుకున్నాను అంటూ వస్తున్న రూమర్స్ లో ఏమాత్రం వాస్తవం లేదనే విషయాన్ని తనదైన స్టైల్ లో క్లారిటీ ఇచ్చింది.
అంతే కాకుండా.. దయచేసి ఈ విధంగా కథనాలు రాసే ముందు ఒకటికి రెండు సార్లు మీడియా వారు చెక్ చేసుకుని రాస్తే బాగుంటుందని ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియచేసింది.