విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం సంక్రాంతికి సైంధవ్ అంటూ వచ్చాడు. ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. అదే.. సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ తర్వాత వెంకీ ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ప్రకటించలేదు కానీ.. ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. ప్రచారంలోకి వచ్చిన ఆ వార్త ఏంటి..? వెంకీ నెక్ట్స్ మూవీ ఎవరితో..?
వెంకటేష్ ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ సారధి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుంది. జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతికి ఈ సినిమా వస్తుందా..? వాయిదా పడనుందా..? అనే డౌట్ ఉండేది కానీ.. రావడం పక్కా అంటూ కన్ ఫర్మ్ చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ మూవీ తర్వాత వెంకీ ఎవరితో సినిమా చేయనున్నాడంటే.. విమల్ కృష్ణ పేరు వినిపిస్తోంది. విమల్ కృష్ణ డీజే టిల్లు సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు వెంకీ కోసం ఓ కథ రెడీ చేశాడని తెలిసింది.
డీజే టిల్లు తర్వాత విమల్ కృష్ణ టిల్లు స్వ్కేర్ మూవీ చేస్తాడనుకున్నారు కానీ.. క్రియేటీవ్ డిఫరెన్సస్ రావడం వలన ఆ ప్రాజెక్ట్ కు దూరంగా ఉన్నాడు. అప్పటి నుంచి ఓ కథ పై వర్క్ చేస్తున్నాడు. ఆ కథ వెంకీకి కరెక్ట్ గా సెట్ అవుతుందట. ఇటీవల వెంకీకి విమల్ కృష్ణ కథ చెబితే ఎస్ చెప్పాడని తెలిసింది. టిల్లులా ఇది కూడా ఓ హిలేరియస్ ఎంటర్‌టైనర్ అని సమాచారం. 2025 ప్రారంభంలో ఈ మూవీని మొదలెడతాతారు. అదే ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి. సిద్దును కొత్తగా చూపించిన విమల్ కృష్ణ.. వెంకీని కూడా కొత్తగా చూపిస్తాడేమో చూడాలి మరి.