ప్రేమకు సోషల్ స్టేటస్ అనేది అంతరం కాదనే కాన్సెప్ట్ ను అందంగా విజువలైజ్ చేస్తూ బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజిషన్ తో శ్రోతల ముందుకొచ్చింది విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ “సాహిబా”. వీడీ చేస్తున్న ఫస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ గా “సాహిబా” మ్యూజిక్ లవర్స్ దృష్టినీ ఆకర్షిస్తోంది. కంపోజర్, సింగర్ జస్లీన్ రాయల్ “సాహిబా”ను రూపొందించారు. విజయ్ కు జోడీగా రాధిక మదన్ నటించింది. “సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్ కు సుధాంశు సరియా దర్శకత్వం వహించారు.
ఓ పేరున్న ఫ్యామిలీకి ఫొటోస్ తీసేందుకు ఫొటోగ్రాఫర్ గా విజయ్ రావడం, అతన్ని చూసి ఆ ఇంట్లోని అమ్మాయి రాధిక మదన్ ఇష్టపడటంతో “సాహిబా” సాంగ్ మొదలైంది. వీరు పరస్పరం ప్రేమించుకోవడం, ఒకరిని కలుసుకునేందుకు మరొకరు ఆరాటపడటం, చివరకు వారు ఎలా కలిశారు అనే అంశాలతో పాట రూపొందించారు. సాంగ్ లో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్, వింటేజ్ మేకింగ్ ఆకర్షణగా నిలుస్తోంది.