ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ మూవీ పుష్ప 2. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన్పటికీ.. రీ రికార్డింగ్ కోసం ఎస్ఎస్ థమన్, అజనీష్ లోకనాథ్ తీసుకున్నారని టాక్. కంగువ రిలీజ్ తర్వాత మరోసారి దేవిశ్రీ గురించి చర్చ మొదలైంది. అసలు ఏమైంది..? ఫుష్ప 2 మేకర్స్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా..?
పుష్ప సినిమా అంతలా పెద్ద విజయం సాధించడంలో అందులోని పాటలు.. సంగీతం కూడా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పచ్చు. పుష్ప 2 నుంచి ఇప్పటి వరకు రెండు పాటలను రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలు విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. రికార్డు వ్యూస్ తో దూసుకెళుతున్నాయి. బన్నీ, సుక్కుతో దేవకిశ్రీకు ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. అయితే.. ఈ మూవీ రీ రికార్డింగ్ పై దృష్టిపెట్టకుండా మ్యూజిక్ ప్రొగ్రామ్స్ చేశాడనే ఉద్దేశ్యంతోనే మరో కారణం వలనో దేవిశ్రీని తప్పించి మరో ఇద్దరికి రీ రికార్డింగ్ చేసే బాధ్యతను అప్పగించారట. ఆ ఇద్దరే ఎస్ఎస్ థమన్. అజనీష్ లోకనాథ్. ఈ వార్త బయటకు వచ్చింది కానీ.. మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.
ఇప్పుడు మరోసారి పుష్ప 2 నుంచి దేవిశ్రీని తప్పించడం అనేది వార్తల్లోకి వచ్చింది. కారణం ఏంటంటే.. కంగువ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాలో పాటలు అంతగా ఆకట్టుకోలేదని.. రీ రికార్డింగ్ కూడా చెప్పుకోదగ్గట్టుగా లేదని టాక్ వచ్చింది. కొంత మంది దేవిశ్రీ రీ రికార్డింగ్ సినిమాకి తగ్గట్టుగా బాగుంది.. కొన్ని సీన్స్ లో మ్యూజిక్కే హైప్ తీసుకువచ్చింది అంటుంటే.. ఏమాత్రం బాలేదు. సౌండ్ పెంచేశాడు తప్పా.. ఏమాత్రం దృష్టి పెట్టినట్టు లేదనే కామెంట్లు కూడా వచ్చాయి. దీంతో పుష్ప 2 రీ రికార్డింగ్ విషయంలో మేకర్స్ సరైన నిర్ణయమే తీసుకున్నారని కొంత మంది అంటుంటే.. సినిమాకి తగ్గట్టుగా రీ రికార్డింగ్ ఉంటుంది. పుష్ప లాంటి సినిమాలకు తగ్గట్టుగా రాక్ స్టార్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తాడు అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా సుకుమార్ మంచి అవుట్ ఫుట్ తో సినిమా రిలీజ్ చేస్తాడు. మరి.. ప్రచారంలో ఉన్న రీ రికార్డింగ్ మేటర్ గురించి త్వరలో మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.