దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒంగోలులో నమోదైన ఫిర్యాదు మేరకు ఆ ఏరియా పోలీసులు ఈ రోజు హైదరాబాద్ చేరుకుని వర్మకు నోటీసులు స్వయంగా అందజేశారు. ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ ఈ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ అప్పటి మాజీ సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. వారి వ్యక్తిగత జీవితాలపై కూడా కించపరిచేలా మాట్లాడారు. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. వర్మతో పాటు శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి పై కూడా ఏపీలో పోలీస్ కేసులు నమోదు అయ్యాయి.