యంగ్ హీరో అఖిల్ అక్కినేని మరోసారి లవ్ స్టోరీకి షిప్ట్ అవుతున్నాడు. మధ్యలో ఏజెంట్ వంటి యాక్షన్ మూవీ ట్రై చేసిన అఖిల్ కు అది కలిసి రాలేదు. దాంతో తన ఏజ్ కు, లుక్స్ కు తగిన మంచి లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్న అఖిల్..ఈసారి మాస్ కు రీచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాయలసీమ నేపథ్య ప్రేమ కథలు సహజంగానే యాక్షన్ తో ఉంటాయి. ఆ యాస కూడా మాస్ కు త్వరగా కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుంది. కిరణ్ అబ్బవరం హీరోగా వినరో భాగ్యము విష్ణుకథ సినిమాను రూపొందించిన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అఖిల్ న్యూ మూవీ త్వరలోనే అనౌన్స్ కానుంది.