మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా విభిన్న కథా చిత్రాల్లో నటిస్తున్నాడు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. అయితే.. ఫ్లాప్ డైరెక్టర్ కరుణకుమార్ తో మట్కా అనే సినిమాతో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇదే ఓ రిస్క్ అనుకుంటే.. ఇప్పుడు మరో రిస్క్ చేయబోతున్నాడని టాక్. ఇంతకీ.. వరుణ్ ఏం చేయనున్నాడు..?
వరుణ్ తేజ్ నటించిన మట్కా చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఇది గ్యాంగ్ స్టర్ డ్రామా. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందించారు. ఈ నెల 14న సూర్య కంగువ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. అయినప్పటికీ.. అదే డేట్ కు వరుణ్ తేజ్ మట్కా మూవీ రిలీజ్ అవుతోంది. కథ పై ఉన్న నమ్మకంతోనే మట్కా మూవీని 14న రిలీజ్ చేస్తున్నామని.. ఖచ్చితంగా మట్కా అందరికీ కనెక్ట్ అవుతుందని.. బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తుందని హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ కరుణకుమార్ గట్టి నమ్మకంతో ఉన్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో మరింతగా స్పీడు పెంచుతున్నారు.
ఫ్లాప్ డైరెక్టర్ కరుణకుమార్ తో మట్కా మూవీ చేయడమే రిస్క్ అనుకుంటే.. ఇప్పుడు మరో ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి వరుణ్ ఓకే చెప్పాడట. ఇంతకీ.. ఎవరా ఫ్లాప్ డైరెక్టర్ అంటారా.. మేర్లపాక గాంధీ. ఈ కాంబో మూవీ గురించి వార్తలు వచ్చినప్పుడు ఇదేదో గ్యాసిప్ అనుకున్నారు కానీ.. ఫైనల్ వెర్షెన్ బాగా రావడంతో ఈ సినిమాకి ఓకే చెప్పాడట వరుణ్. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో హర్రర్, కామెడీ రెండు మిక్స్ చేసి రాసిన వెరైటీ స్టోరీ అని తెలిసింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా తర్వాత మేర్లపాక గాంధీకి చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు. కృష్ణార్జున యుద్ధం, మాస్ట్రో, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా సరే గాంధీకి వరుణ్ తేజ్ ఆఫర్ ఇచ్చాడంటే స్టోరీ ఏదో బాగా వచ్చినట్టు ఉంది అనే టాక్ వినిపిస్తోంది. అలాగే మరో రిస్క్ చేస్తున్నాడని కూడా అంటున్నారు. మరి.. వరుణ్ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.