పుష్ప 2 మూవీకి సంబంధించిన సర్ ప్రైజింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు బీజీఎం చేసేందుకు దేవిశ్రీ ప్రసాద్ ను మార్చారనేది ఆ అప్డేట్ సారాంశం. టాలీవుడ్ మ్యూజిక్ ను ఒక దశలో ఏలాడు దేవి. అంతటి దేవినే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నుంచి తప్పించడం, అదీ సుకుమార్, అల్లు అర్జున్ లాంటి బెస్ట్ ఫ్రెండ్స్ చేయడం షాకింగ్ న్యూస్ గా మారింది.
పుష్ప 2 బీజీఎం విషయంలో సుకుమార్ సంతృప్తి చెందడం లేదట. దీంతో తమన్, అజనీష్ లోకనాథ్, సామ్ సీఎస్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించాలని భావిస్తున్నారట. అదే జరిగితే దేవి కెరీర్ లో ఫస్ట్ టైమ్ పాటలు ఒకరు బీజీఎం మరొకరు ఇచ్చినట్లు అవుతుంది. డిసెంబర్ 5న పుష్ప 2 గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది.