శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటించిన భాగ్ సాలే సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని క్రైమ్ కామెడీ కథతో తెరకెక్కించారు దర్శకుడు ప్రణీత్ బ్రాహ్మాండపల్లి. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్ సినిమాస్, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్త నిర్మాణంలో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. గత నెల 7వ తేదీ భాగ్ సాలే థియేటర్స్ లో రిలీజైంది.
కమర్షియల్ ఫార్మేట్ లోనే ఒక కొత్త అటెంప్ట్ గా ఈ సినిమా పేరు తెచ్చుకుంది. శ్రీ సింహా పర్ ఫార్మెన్స్, దర్శకుడిగా ప్రణీత్ న్యూ స్టైల్ మేకింగ్, కొత్త తరహా సినిమాలు చేయాలనే ఈ నిర్మాణ సంస్థల ప్రయత్నంతో క్రిటికల్ అక్లైమ్డ్ మూవీగా భాగ్ సాలే గుర్తింపు పొందింది. ఓటీటీ లవర్స్ కోసం స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మంచి నెంబర్స్ క్రియేట్ చేసే అవకాశముంది.