రివ్యూ – “ధూం ధాం” ట్రైలర్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన “ధూం ధాం” సినిమా ఈ నెల 8వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి “ధూం ధాం” సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ బిగినింగ్ టు ఎండింగ్ ఫన్ రైడ్ లా ఉందని చెప్పిన అనిల్ రావిపూడి…మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ చెప్పారు.

“ధూం ధాం” సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – భూపతి ఫ్యామిలీలో మహేశ్వర భూపతి, మహదేవ భూపతి, నీలకంఠ భూపతి పవర్ ఫుల్ పర్సన్స్. కోసి కారం పెడతా అని అనడమే కాదు నిజంగా చేసి చూపిస్తారు. అలాంటి భూపతి ఫ్యామిలీకి కాబోయో అల్లుడు వెన్నెల కిషోర్. అతను ఎన్ఆర్ఐ, మంచి సంబంధం కాబట్టి భూపతి ఫ్యామిలీ వెన్నెల కిషోర్ కు చాలా గౌరవం ఇస్తారు. అతను ఎంత ఫ్రస్టేట్ అయినా ఏమీ అనరు. వెన్నెల కిషోర్ కజిన్ గా పెళ్లి ఇంట అడుగుపెడతాడు హీరో చేతన్. అతని తండ్రి సాయికుమార్. గొప్ప కుటుంబం నుంచి వచ్చిన చేతన్…ఈ భూపతి ఫ్యామిలీలోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు. అతని లక్ష్యమేంటి, హెబ్బా పటేల్ తో అతని ప్రేమకథ ఎలా సక్సెస్ చేసుకున్నాడు అనే అంశాలకు లీడ్ ఇస్తూ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. పెళ్లి ఇంట్లో ప్రవీణ్, గిరి, నవీన్ నేనితో కలిసి వెన్నెల కిషోర్, హీరో చేసిన హంగామా అంతా మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రంగా ధూం ధాం సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది.