నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన లక్కీ భాస్కర్(Lucky bhaskar) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొన్నారు హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda). ఈ కార్యక్రమంలో ఆయనను దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) ప్రశంసించారు. విజయ్ తనకు ఇష్టమైన నటుడు అని అన్నారు. తన లైఫ్ లో ఎంతో ప్రేమను, ప్రేమకంటే రెట్టింపు ద్వేషాన్ని చూశాడని త్రివిక్రమ్ చెప్పారు. అవన్నీ తట్టుకుని నిలబడ్డ గట్టివాడు విజయ్ అంటూ ప్రశంసించారు.
విజయ్ దేవరకొండ కంటే తాను పెద్దవాడినని అందుకే ఆయనను బ్లెస్ చేస్తున్నానంటూ త్రివిక్రమ్ అన్నారు. ఆయన మాటలతో విజయ్ దగ్గరకు వెళ్లి త్రివిక్రమ్ ను హగ్ చేసుకున్నారు. మొత్తం ఈవెంట్ లో ఈ సందర్భంగా హైలైట్ అయ్యింది. త్రివిక్రమ్ విజయ్ గురించి చెప్పిన మాటలతో వీరి కాంబో మూవీ త్వరలో సాధ్యవుతుందంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ విజయ్ కలిస్తే ఓ క్రేజీ మూవీ రావడం ఖాయం. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా ఈ నెల 31న రిలీజ్ కు వస్తోంది.