ప్రభాస్ తో యాక్షన్ మూవీ చేస్తా, మహేశ్ నేను ఒకే స్కూల్ స్టూడెంట్స్ – హీరో సూర్య

టాలీవుడ్ హీరోలతో తనకు మంచి స్నేహం ఉందని చెప్పారు హీరో సూర్య. వైజాగ్ లో జరిగిన కంగువ సినిమా మెగా ఈవెంట్ లో సూర్య పాల్గొన్నారు. స్టార్ హీరోస్ గురించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు సూర్య. వైజాగ్ లో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్ కు పెద్ద ఎత్తున ఆడియెన్స్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ – రామ్ చరణ్ నాకు మంచి ఫ్రెండ్. నా సినిమాలు చూసి ఫోన్ చేసి ఎలా ఉందో చెబుతుంటారు. అల్లు అర్జున్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అరవింద్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ప్రభాస్ డార్లింగ్. రాత్రి ఫోన్ చేసి డిన్నర్ రెడీ అని చెప్పాడు. ఎంతో ప్రేమగా ఉంటాడు. ప్రభాస్ తో ఓ యాక్షన్ మూవీ చేయాలని ఉంది. మహేశ్ బాబు నేనూ చెన్నైలో ఒకే స్కూల్ లో చదువుకున్నాం. ఆయన తనదైన స్టైల్ లో మూవీస్ చేస్తారు. అన్నారు. సూర్య కామెంట్స్ మన హీరోల ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాయి.