చిరు, నాగ్ కాంబో మూవీ.. సెట్ అయ్యేది ఎప్పుడు.?

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), కింగ్ నాగార్జున(Nagarjuna).. ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య ఎంత అనుబంధం ఉందో.. ఎంత స్నేహంగా ఉంటారో తెలిసిందే. అయితే.. వీరిద్దరూ కలిసి నటిస్తే.. చూడాలని అటు మెగా ఫ్యాన్స్, ఇటు నాగ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తాజాగా ఈ క్రేజీ కాంబో మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఏంటి..? మరి.. ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యేది ఎప్పుడు..?

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున.. కలసి సినిమా చేస్తే చూడాలని ఎప్పటి నుంచో అభిమానులు కోరుకుంటున్నారు. మంచి కథ కుదిరితే.. మేమిద్దరం కలిసి నటించడానికి రెడీ అని చిరు, నాగ్ ఎప్పుడో ప్రకటించారు కానీ.. ఇంత వరకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఓ వైపు చిరు, మరో వైపు నాగ్ ఇద్దరు తమ సినిమాలతో బిజీ అయ్యారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్నారు. నాగార్జున కూలీ మూవీ చేస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు 60 ప్లస్ అయినప్పటికీ అదే గ్రేస్, అదే స్మార్ట్ లుక్స్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుండడం విశేషం.

మహానటుడు అక్కినేని శత జయంతిని పురస్కరించుకొని ఏఎన్నార్ నేషనల్ అవార్డుని మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించారు. ఇక ఈ అవార్డుల వేడుక కోసం కింగ్ నాగార్జున తాజాగా చిరంజీవిని కలిసి ఇన్విటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి ఫోటోలకి ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు హ్యాండ్సమ్ లుక్ లో ఈ ఫోటోలలో మెరిసిపోతూ ఉండటం విశేషం. మెగాస్టార్ చిరంజీవి టీ షర్ట్ వేసుకుని, కింగ్ నాగార్జున కలర్ ఫుల్ షార్ట్, కార్లింగ్ హెయిర్, స్టైలిష్ గడ్డంతో చాలా మోడ్రన్ గా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుంచి వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే బాగుంటుందనేది మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. ఇద్దరూ కలిసి నటించడానికి రెడీ. కాబట్టి ఏ రైటర్ అయినా.. డైరెక్టర్ అయినా.. ఈ క్రేజీ కాంబోను సెట్ చేస్తారేమో చూడాలి. అదే కనుక జరిగితే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.