స్టార్ హీరో సూర్య(Suriya) తన కంగువ(Kanguva) సినిమాతో స్క్రీన్ మీదకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే నెల 14న కంగువ పాన్ ఇండియా రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమా ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్య అభిమానులు పంచుతున్న ప్రేమను తల్చుకుని ఎమోషనల్ అయ్యారు. తన సినిమాలు రెండేళ్లుగా రిలీజ్ కాకున్నా.. సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా రీ రిలీజ్ టైమ్ లో వచ్చిన రెస్పాన్స్ చూసి భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.
ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు సూర్య కళ్లలో నీరు తిరిగింది. మీ రక్తం నా రక్తం వేరా అంటూ అభిమానులు తన బ్లడ్ బ్రదర్స్ అని చెప్పాడు సూర్య. ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా కంగువ లాంటి గ్రేట్ మూవీని వారికి ఇస్తున్నట్లు సూర్య చెప్పారు. సూర్య స్పీచ్ వైరల్ అవుతోంది.