రివ్యూ – మిస్టేక్

నటీనటులు – అజయ్ కతుర్వార్, సుజిత్ కుమార్, తేజ అయినంపూడి, కరిష్మ కుమార్, తానియా కర్ల, ప్రియా పాల్, అభినవ్ సర్దార్, రాజా రవీంద్ర, జబర్దస్త్ నరేష్, సమీర్

టెక్నికల్ టీమ్- సినిమాటోగ్రఫీ – హరి జాస్తి, సంగీతం – మని జెన్నా, ఎడిటర్ – విజయ్ ముక్తవరపు, రచన దర్శకత్వం – భరత్ కోమలపాటి

చిన్న చిత్రాలు పెద్ద విజయాలు సాధిస్తున్న సమయమిది. కంటెంట్ బాగున్న కథలు ఓటీటీలో కూడా సక్సెస్ అవుతున్నాయి. అందుకే కొన్ని స్మాల్ బడ్జెట్ మూవీస్ పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా బాగుంటుందేమో అనుకుని థియేటర్స్ కు వెళ్తున్నారు. మరి అలాంటి అంచనాలతో మిస్టేక్ మూవీకి వెళ్లిన ఆడియెన్స్ కు ఎదురైన ఎక్సీపిరియన్స్ ఏంటి ఈ రివ్యూలో చూద్దాం..

కథేంటంటే

కొత్తగా పెళ్లైన మూడు జంటల మధ్య సాగే కథ ఇది. జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితుల్లో చిక్కుకున్న వీరి..ఆ పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు వెకేషన్ ట్రిప్ కు వెళ్తారు. అక్కడైనా రిలాక్స్ గా కొద్ది రోజులు ఉందామని అనుకునే వీరికి …ఒక అపరిచితుడు వెంటపడుతూ కనిపిస్తాడు. అతని నుంచి తప్పించుకునేందుకు ఈ మూడు జంటలు ప్రయత్నిస్తుంటాయి. ఈ కపుల్స్ దగ్గర డైమండ్స్ ఉన్నాయని అనుకుని ఆ అపరిచితుడు వీరి వెంటపడతాడు. మరి వీరి దగ్గర నిజంగానే డైమండ్స్ ఉన్నాయా…ఉంటే వాటిని వెంటాడే వ్యక్తికి దక్కకుండా ఎలా తప్పించుకున్నారు అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే…

లైన్ గా చెప్పుకున్నట్లే ఇది చాలా చిన్న కథ. ఆ కథలోని ఒక చిన్న ట్విస్ట్ ను ఆధారం చేసుకుని దర్శకుడు సినిమాను రూపొందించాడు. ఈ పాయింట్ చుట్టూ ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే రాసుకోవడంలోనే తప్పంతా జరిగింది. మూడు జంటలు ట్రిప్ కు వెళ్లడం, అక్కడో స్ట్రేంజర్ వీరి వెంటపడటం నుంచి కథలో ఆసక్తి మొదలవుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు ఆ ఇంట్రెస్ట్ కొనసాగదు. టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉంటూనే, ఆర్టిస్టుల నుంచి మంచి పర్ ఫార్మెన్స్ కనిపిస్తే ఇలాంటి సినిమాను మినిమమ్ ఆకట్టుకుంటాయి. కానీ ఈ రెండు విషయాల్లో మిస్టేక్ జరిగింది. టెక్నికల్ గా ఒక్క సంగీతాన్ని మినహాయిస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్…ఇలా ఏ విభాగమూ మెప్పించదు.

ఒక థ్రిల్లర్ సినిమాను చేయాలనుకున్న దర్శకుడు సన్నీ మూవీ ఔట్ పుట్ మాత్రం అలా తీసుకురాలేకపోయాడు. కథను కన్ఫ్యూజన్ డ్రామాగా మార్చేశాడు. ఈ ఛేజింగ్ మూవీలో కామెడీని క్రియేట్ చేసేందుకు కూడా ట్రై చేసినా…అదేమీ నవ్వించలేదు. నటీనటుల్లో అజయ్ కతుర్వార్, సుజిత్ కుమార్, తేజ అయినంపూడి, కరిష్మ కుమార్, తానియా కర్ల, ప్రియా పాల్ వీళ్లు మెయిన్ లీడ్ కాగా…సమీర్, రాజా రవీంద్ర, అభినవ్ సర్దార్ కీ రోల్స్ చేశారు. స్క్రిప్ట్స్, డైలాగ్స్, డైరెక్షన్ ఎలా వీక్ గా ఉందో..వీళ్ల నటన కూడా అలాగే ఎక్కడా ఇంపాక్ట్ చూపించలేదు.