షూటింగ్ పూర్తి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం “క” మూవీ

పీరియాడిక్ మూవీ అంటే ఒక యజ్ఞం. ఫ్రేమ్ లో కనిపించే ప్రతి వస్తువూ ఒక యాంటిక్ అయి ఉండాలి. ఈ ప్రాపర్టీస్ లో కొన్ని తయారు చేయిస్తే మరికొన్ని సేకరించాలి. ఆ కాలంలో జరిగిన కథలా సినిమా అంతా కనిపించాలి. ఇలాంటి యజ్ఞం లాంటి ప్రయత్నంతో ఎన్నో అందమైన లొకేషన్స్ తో “క” మూవీ(KA movie) షూటింగ్ ను పూర్తి చేశారు మేకర్స్. లాస్ట్ డే షూట్ ను సెలబ్రేట్ చేసుకున్నారు మూవీ టీమ్. ఈ సెలబ్రేషన్స్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) హీరోగా నటిస్తున్న ఈ భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్(Sudeep and sandeep) రూపొందిస్తున్నారు. “క” సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.