సందీప్ కిషన్…పీపుల్ స్టార్ ఏంటి

హీరోలకు పేర్ల ముందు ట్యాగ్స్ ఉంటాయి. అదేనండి బిరుదులు.. అందులో కొన్ని అభిమానులు ఇచ్చినవి అయితే.. కొన్ని ఆ హీరోలను ఇష్టపడే దర్శకలు, నిర్మాతలు పెట్టినవి. మరి కొంత మంది అయితే.. ఆ హీరోలే సొంతంగా పెట్టుకుంటుంటారు. ఇప్పుడు సందీప్ కిషన్ కూడా అలాగే ఒకటి పెట్టేసుకున్నాడు. ఇది అవసరమా సందీప్ అంటూ విమర్శలు వస్తున్నాయి. సందీప్ నిర్ణయం సరైనదేనా..? ఇంతకీ.. ఏమైంది..?

సూపర్ స్టార్, పవర్ స్టార్ లాంటి బిరుదులు వేరు, వేరు ఇండస్ట్రీల్లో హీరోలకు వాడుతుంటారు కానీ.. ఒకే ఇండస్ట్రీలో ఉంటూ ఒక హీరో బిరుదును మరో హీరో వాడుకోవడం అనేది జరగదు. అయితే.. యంగ్ హీరో సందీప్ కిషన్ మాత్రం సీనియర్ హీరో బిరుదును తన పేరు పక్కన పెట్టేసుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. సందీప్ కిషన్(Sandeep kishan) నక్కిన త్రినాధరావు(nakkina trinadharao) డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. దీనికి మజాకా(Mazaka) అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో సందీప్ కిషన్ పేరు ముందు పీపుల్ స్టార్(People star) అని రాశారు. ఇప్పటి వరకు సందీప్ కిషన్ కు బిరుదు అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఇలా పీపుల్ స్టార్ అని రాయడం పై విమర్శలు వస్తున్నాయి.

టాలీవుడ్ లో పీపుల్ స్టార్ అనగానే ఠక్కున ఆర్ నారాయణమూర్తి గుర్తొస్తారు. ఆయన ప్రజల కోసం ప్రజల కష్టాలను అందరికీ తెలియచేసేలా ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. ఎర్రసైన్యం, ఓరేయ్ రిక్షా, చీమలదండు ఇలా ఎన్నో సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రజల కోసం సినిమాలు తీసారు కాబట్టి ఆయనకు పీపుల్ స్టార్ అనే బిరుదు కట్టబెట్టారు. ఆయన కూడా తన సినిమాల్లో పీపుల్ స్టార్ అనే బిరుదు వేస్తుంటారు. ఆయన సినిమాలు తీయడం తగ్గించారు. ఇప్పుడు సందీప్ కిషాన్ ఈ బిరుదును తీసుకోవడం పై విమర్శలు వస్తున్నాయి. ఆయనకున్న ఇమేజ్ కు సందీప్ కిషన్ కు ఉన్న గుర్తింపుకు పొంతన లేదు. సందీప్ కిషన్ ఈ బిరుదును కంటిన్యూ చేస్తాడో లేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో తీసేస్తారో చూడాలి మరి.