తెలంగాణలో “దేవర” టికెట్ రేట్లు ఇవే, జీవో జారీ

ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన దేవర(Devara) సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ చిత్రాలకు బెన్ ఫిట్ షోస్, టికెట్ రేట్లు పెంచుకునేందుకు గత కొద్ది కాలంగా తెలుగు రాష్ట్రాలు అనుమతి ఇస్తున్నాయి. ఈ క్రమంలో దేవర సినిమా టికెట్ ధరల పెంపునకు కూడా తెలంగాణ ప్రభుత్వం(Telangana) అనుమతిచ్చింది. ఈ విషయంలో ఇప్పటికే క్లారిటీ ఉన్నా..తాజాగా ప్రభుత్వం జీవో(G.O) జారీ చేసింది.

దేవర రిలీజ్ ముందు రోజు రాత్రి 1 గంట నుంచే బెన్ ఫిట్ షోస్ ప్రారంభమవుతాయి. తెలంగాణలో మొత్తం 29 థియేటర్స్ లో ఈ ఒంటిగంట షోస్ ప్రదర్శిస్తారు. 27న ఉదయం 4 గంటలు, 6 గంటల షోస్ ఉంటాయి. మొదటి రోజు అన్ని థియేటర్స్ లో 100 రూపాయలు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు 9 రోజులపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 25 రూపాయలు, మల్టీఫ్లెక్స్ లో 50 రూపాయల వరకు టికెట్ రేట్స్ పెంచనున్నారు. దేవర రిలీజ్ జీవో నేపథ్యంలో ఎన్టీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు.