బాస్ మెచ్చాడు ఆఫర్ ఇచ్చాడు

ఇటీవల తనను అభిమానించే దర్శకులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). దర్శకుడు బాబీ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. ఆయనతో వాల్తేరు వీరయ్య సినిమా చేశారు మెగాస్టార్. బాబీ కథ విని చాలా ఆర్డనరీగా ఉందని, దాన్ని మేకింగ్ లో గ్రాండ్ గా చూపించాలని చెప్పారట చిరంజీవి. కథ వీక్ అని తెలిసినా బాబీ కోసం సినిమాలో నటించారు చిరంజీవి. ఇప్పుడు అలాగే తనను అభిమానించే హరీశ్ శంకర్(Harish shankar) కోసం మెగాస్టార్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు.

రీసెంట్ గా ఓ యాడ్ ఫిల్మ్ చేశాడు మెగాస్టార్. దానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇదే టైమ్ లో మంచి స్క్రిప్ట్ చేసుకోమని చిరంజీవి హరీశ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ మెగాస్టార్ కు డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్(Dvv Entertainments) తో ఓ సినిమా చేయాలనే కమిట్ మెంట్ ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ టైమ్ లోనే నిర్మాత దానయ్య చిరంజీవితో సినిమాకు అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడా ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ లాంటి ఫ్లాప్ తర్వాత హరీశ్ శంకర్ కు చిరంజీవితో సినిమా అవకాశం అంటే లక్ అనుకోవచ్చు.