ఐదేళ్లకు రిలీజ్ కు వస్తున్న పవన్ “హరి హర వీరమల్లు”

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న సినిమా హరి హర వీరమల్లు(Hari Hara veeramallu) సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది మార్చి 28న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ఈ రోజు ప్రకటించారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కు పవన్ కల్యాణ్ డేట్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచే విజయవాడలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

పవన్ షెడ్యూల్ మొదలైన రోజే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు హరి హర వీరమల్లు మేకర్స్. ఈ చిత్రాన్ని దయాకర్ రావుతో కలిసి నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తుండగా..ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 2020 జనవరిలో హరి హర వీరమల్లు సన్నాహాలు మొదలుకాగా సెప్టెంబర్ లో దర్శకుడు క్రిష్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 28 రిలీజ్ అంటే ఐదేళ్లకు పైగా టైమ్ తీసుకున్నట్లే.