24 వేల డ్యాన్స్ మూవ్ మెంట్స్ తో మెగాస్టార్ గిన్నీస్ రికార్డ్

46 ఏళ్ల అప్రతిహత కెరీర్, 156 సినిమాలు, 537 పాటలు, 24 వేల డ్యాన్స్ మూవ్ మెంట్స్ …ఇవీ మెగాస్టార్(Megastar chiranjeevi) గిన్నీస్ రికార్డ్(Guinness World Record) కు కారణమైన అంకెలు. ప్రపంచంలో మరో నటుడు 24 వేల డ్యాన్స్ మూవ్ మెంట్స్ చేయలేదు. ఈ ఫీట్ తో మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ సాధించారు. ఈ రికార్డు ప్ర‌క‌టించే కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో ఘనంగా జ‌రిగింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్‌ఖాన్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ `గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ గురించి నేనెప్పుడూ ఊహించ‌లేదు. గిన్నిస్ బుక్‌కి, మ‌న‌కూ ఏంటి సంబంధం అని మామూలుగా అనుకుంటాం క‌దా.. కానీ, నాకు అలాంటి ఊహే లేదు. నా చిన్న‌ప్పుడు మా చుట్టుప‌క్క‌ల ఉన్న‌వారిని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి నేను డ్యాన్సులు చేసేవాడిని. ఎన్‌సీసీలో చేరిన త‌ర్వాత సాయంత్రాల్లో క్యాంఫైర్ టైమ్‌లో, తిన్నాక అల్యూమినియ‌మ్ ప్లేట్ల‌ను తిర‌గేసి వాయించి డ్యాన్సులు వేసేవాడిని. అలా డ్యాన్సులు నా జీవితంలో భాగ‌మ‌య్యాయి.“ అని అన్నారు.