అల్లు అర్జున్ పై దుష్ప్రచారం చేస్తున్నారు – నిర్మాత రవిశంకర్

జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వివాదంలో అల్లు అర్జున్ ఉన్నాడు అనే వార్తలను ఖండించారు పుష్ప 2 నిర్మాత రవిశంకర్. జానీ మాస్టర్, లేడీ డాన్సర్ వివాదం పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన పర్సనల్ ఇష్యూ అని ఆయన అన్నారు. పుష్ప 2 సినిమా స్టార్టింగ్ నుంచి అన్ని పాటలకు అడిషనల్ కొరియోగ్రఫర్ గా ఆ లేడీ డాన్సర్ ను పెట్టుకున్నామని ప్రొడ్యూసర్ రవిశంకర్ తెలిపారు.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ – తెర వెనక ఏం జరుగుతుంది అనేది ఎ‌వరికీ తెలియదు. పుష్ప 2 సినిమాకు బాధితురాలు అయిన లేడీ డ్యాన్స్ మాస్టర్ పనిచేసింది. పుష్ప 2 సినిమా నుంచి ఆరు నెలల క్రితం రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ లో కూడా ఆ డాన్సర్ పేరు ఉంది. జానీ మాస్టర్ తో రెండురోజుల్లో ఒక స్పెషల్ సాంగ్ చేద్దామనుకునే లోపు ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది . వాళ్ల మధ్యలో ఏం జరుగుతుంది అనేది అల్లు అర్జున్ కు తెలియదు. అల్లు అర్జున్ పై కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళ ఉనికి కోసం ఇలా అలజడి సృష్టిస్తున్నాయి. అల్లు అర్జున్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. జానీ మాస్టర్ ఆ లేడీ డాన్సర్ మధ్య వివాదం పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత విషయం. అని అన్నారు.