ఇంత నెగిటివిటీలోనూ ఎన్టీఆర్ పాజిటివ్ గానే ఉన్నాడు

దేవర(Devara) సినిమా టీమ్ మరోసారి అన్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కారణం నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం. మీడియం రేంజ్ హీరోలు, డబ్బింగ్ సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ జరిగే నోవాటెల్ హోటల్ లో ఎన్టీఆర్(NTR) లాంటి పెద్ద హీరో ఈవెంట్ పెట్టడం వల్ల అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అభిమానుల తోపులాటలతో నోవాటెల్ అద్దాలు ధ్వంసమయ్యాయి.

దీంతో పోలీసులు ఈవెంట్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. అభిమానులను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. దేవరకు మొదటి నుంచి వస్తున్న నెగిటివ్ వైబ్స్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు ఫైనల్ టచ్ లా ఉంది. అయినా ఎన్టీఆర్ పాజిటివ్ గానే ఉన్నారు. ఈవెంట్ రద్దు పట్ల ఎన్టీఆర్ తన విచారం వ్యక్తం చేశారు. ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈ నెల 27న థియేటర్స్ లోకి వస్తున్న దేవర ఆకట్టుకుంటుందని, ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా ఉంటుందని అన్నాడు. సినిమా ఫలితం పట్ల ఎన్టీఆర్ నమ్మకంగానే ఉన్నట్లు తెలుస్తోంది.