పవన్ కళ్యాణ్‌ ఓజీలో శింబు..?

తమిళ్ స్టార్ హీరో శింబు(Simbhu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వల్లభ , మన్మథ లాంటి సినిమాలతో తెలుగులో కూడా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని అభిమానులను సంపాదించుకున్నాడు. యూత్ ఫుల్ కాన్సప్ట్ సినిమాలు చేస్తూ యూత్ కి మరింత దగ్గరయ్యాడు శింబు. కేవలం నటుడిగానే కాకుండా శింబు లో మంచి సింగర్ కూడా ఉన్నాడు. శింబుకు పాటలు పాడటం కొత్తేం కాదు.. టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో పాటు మరి కొంత మంది హీరోల సినిమాలకు శింబు పాటలు పాడి మెప్పించాడు. ఇప్పుడు పవర్ స్టార్ ఓజీ(OG movie)లో శింబు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనా..?

తమిళ్ స్టార్ హీరో శింబు తమిళ్ లోనే కాదు.. తెలుగులో కూడా పాటలు పాడారు. ఇది వరకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బాద్ షా మూవీ కోసం డైమెండ్ గర్ల్ అంటూ ఓ పాట పాడారు. ఇక మంచువారబ్బాయి మనోజ్ నటించిన పోటుగాడు మూవీ కోసం బుజ్జి పిల్ల అంటూ సాగే పాటను శింబు పాడారు. అలాగే యంగ్ హీరో రామ్ పోతినేని వారియర్ కి బుల్లెట్ సాంగ్ ను పడిన శింబు ఈమధ్య నిఖిల్ 18పేజిస్ కోసం టైం ఇవ్వు పిల్ల టైం ఇవ్వు అనే పాటను పాడారు. శింబు పాడిన ఈ పాటలు విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్లాయి.

ఇప్పుడు ఏకంగా వపర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తోన్న ఓజీ మూవీలోనే ఓ పాట పాడే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. ఇన్ని రోజులు పవన్ ఓజీ కోసం శింబు అంటూ వార్తలు వస్తే ఇదేదో గ్యాసిప్ అనుకున్నారు కానీ.. ఇది నిజమే అని తెలిసింది. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వంలో శింబు పాడిన పాటను ఆల్రెడీ రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఈ పాట పవర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయం అని టాక్ వినిపిస్తోంది. దసరాకు పవన్ నటిస్తున్న సినిమాల నుంచి అప్ డేట్స్ ఇవ్వనున్నారు. ఓజీ నుంచి అయితే.. శింబు పాటకు సంబంధించి అప్ డేట్ ఇవ్వనున్నారని తెలిసింది. శింబు, థమన్, సుజిత్ కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి.. ఓజీ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.