“సరిపోదా శనివారం” ఓటీటీ డేట్ ఫిక్స్

నాని(Nani) హీరోగా నటించిన సరిపోదా శనివారం(Saripodhaa sanivaaram) సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 26వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఈ రోజు నెట్ ఫ్లిక్స్ ఈ అనౌన్స్ మెంట్ చేసింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో సరిపోదా శనివారం సినిమా అందుబాటులో ఉండనుంది.

గత నెల 29న థియేటర్స్ లోకి వచ్చింది సరిపోదా శనివారం సినిమా. టీమ్ తెలుగుతో పాటు మిగతా భాషల్లో బాగా ప్రమోట్ చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు ఈ సినిమా కలెక్షన్స్ ను ఎఫెక్ట్ చేశాయి. సినిమా కూడా ఓకే అనే టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర బయ్యర్స్, ప్రొడ్యూసర్ కు లాభాలా రాబట్టలేకపోయిందీ సినిమా. అప్పుడు వర్షాల కారణంగా థియేటర్స్ లో సరిపోదా శనివారం చూడనివారు నెట్ ఫ్లిక్స్ లో చూసే అవకాశం ఉంది.