“ఎస్ఎస్ఎంబీ 29” అనుకున్నంత ఆలస్యం కాదట

దర్శకుడు రాజమౌళి(Rajamouli) సినిమాలంటే షూటింగ్ రిలీజ్ కు కనీసం రెండు నుంచి మూడేళ్ల టైమ్ పడుతుంది. హీరోలు అందుకే ఆయనకు బల్క్ డేట్స్ ఇస్తుంటారు. అయితే రాజమౌళి మహేష్(Mahesh babu) హీరోగా రూపొందిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29(SSMB 29) సినిమాకు వేగం పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ముందు యాక్షన్ పార్ట్, వీఎఫ్ఎక్స్ తో కూడిన సీన్స్ ముందుగా తీయాలని నిర్ణయించారట.

ఏ సినిమాకైనా ఎక్కువ రోజులు టైమ్ తీసుకునేది యాక్షన్ పార్ట్స్ కే. వీఎఫ్ఎక్స్ కూడా పర్పెక్ట్ గా రావాలంటే చాలా టైమ్ కావాలి. ఇందుకో ఈ సీన్స్ ముందు తీసేసి పోస్ట్ ప్రొడక్షన్ కు ఇచ్చేయాలని రాజమౌళి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రెస్టీజియస్ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. త్వరలోనే ఈ సినిమాను లాంఛనంగా అనౌన్స్ చేయబోతున్నారు. ఆఫ్రికన్ అడ్వెంచర్ కథతో సాగే ఈ సినిమాను సౌత్ ఆఫ్రికాలో షూట్ చేయబోతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్(Sri durga arts) లో కేఎల్ నారాయణ(KL narayana) ఎస్ఎస్ఎంబీ 29 సినిమాను నిర్మిస్తున్నారు.