తనతో సినిమా చేయమంటూ తమిళ డైరెక్టర్ కు ఎన్టీఆర్ రిక్వెస్ట్

తమిళ దర్శకుడు వెట్రిమారన్ తన ఫేవరేట్ డైరెక్టర్ అని అతనితో ఒక సినిమా చేయాలనే కోరిక ఉందని అన్నారు ఎన్టీఆర్. తనతో ఒక సినిమా చేయమని ఎన్టీఆర్ దర్శకుడు వెట్రిమారన్ కు రిక్వెస్ట్ చేశారు. చెన్నైలో జరిగిన దేవర ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ఈ రిక్వెస్ట్ చేశారు. చెన్నైలో జరిగిన దేవర ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ అనర్గళంగా తమిళంలో మాట్లాడటం తమిళ ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేసింది. ఎన్టీఆర్ చిన్నప్పుడు చెన్నైలో వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. అదే సమయంలో ఆయనకు తమిళ భాష మాట్లాడటం అలవాటు అయ్యింది.

దేవర ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ – నేను తమిళంలో ఒక సినిమా చేయాలి. అది దర్శకుడు వెట్రిమారన్ తో ఉండాలనేది నా కోరిక. స్ట్రైట్ తమిళ సినిమా చేసి అది తెలుగులో డబ్ చేయాలని ఉంది. నేడు రాష్ట్రాల మధ్య భాషల అంతరమే గానీ సినిమా బేధం లేదు. బాహుబలి తర్వాత భాషా బేధాలు లేకుండా మంచి సినిమా ప్రేక్షకులందరికీ చేరుతోంది. అన్నారు.

ఆడుకాలం, విసారనై, అసురన్, కాక్క ముట్టై వంటి సామాజిక నేపథ్య చిత్రాలతో ప్రేక్షకుల ప్రశంసలతో జాతీయ అవార్డులు అందుకున్నారు దర్శకుడు వెట్రిమారన్